album మహిమాన్వితుడా హోసన్నా 2015 గీతాలు Hosanna ministries 2015 full album
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా
నిరంతరం స్తోత్రర్హుడా

రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకునన్నాదరించె సత్యవాక్యామా
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా
1. 
కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె // Alpha//

2. 
తేజోమాయుడా నీదివ్య  సంకల్పమే
 
ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి 
అగ్నిజ్వాలగా ననుచేసెను
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకె // Alpha//

 3.
నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని ఆగాదాలు దాటింఛి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే // Alpha//