Telugu lyrics of Lemmu Tejarillumu ani

లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు

1.రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము " లెమ్ము "


2.శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత " లెమ్ము "


3.తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము " లెమ్ము "